అనుకున్నది మాటల్లో కాదు.. ఆచరణలో పెట్టండి : ఆనంద్ మహీంద్రా

గురువారం, 5 జనవరి 2023 (15:37 IST)
తనను ఫాలో అవుతున్న నెటిజన్లతో పాటు దేశ ప్రజలకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ హితవు పలికారు. కొత్త సంవత్సరం తీర్మానం పేరుతో దీన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మనస్సులో అనుకున్నదాన్ని మాటల్లోకాకుండా ఆచరణలో పెట్టాలని సూచించారు. ఇదే అంశంపై ఆయన చేసిన ఓ ట్వీట్‌కు ఇపుడు లక్షలాది మంది స్వాగతిస్తూ లైకులు, రీ ట్వీట్‌లు చేస్తున్నారు. 
 
సాధారణంగా 60 నిమిషాలు గడిస్తే ఒక నిమిషం. 60 నిమిషాలు గడిస్తో ఓ గంట. 24 గంటలు గడిస్తే ఒక రోజు. 365 రోజులు గడిస్తే ఒక యేడాది. ఇలా కారచక్రం తిరుగుతూనే వుంటుందని, మార్పు కోసం, మంచి కోసం సానుకూల ఫలితాలను సాధించేందుకు కొత్త యేడాదే కానక్కర్లేదని తెలిపారు. జనవరి ఒకటో తేదీ వరకు వేచి చూడనక్కర్లేదు. కానీ, కొంతమంది కొత్త సంవత్సరం సందర్భంగా తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. పోనీ అనుకున్నది ఆచరిస్తారా? అంటే సందేహమే అని అన్నారు. 
 
ముఖ్యంగా, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు చేయకూడదు. కొత్త సంవత్సరంలో ప్రతి రోజూ అరగంట వ్యాయామం చేయాలి. నిత్యం యోగా చేయాలి. ఇలాంటివే కొన్ని తీర్మానాలు. కానీ అనుకున్నది ఆచరణలో పెట్టే వారు తక్కువే. కొందరు అనుకున్నది మొదలుపెట్టి వాటిని ముగించేస్తుంటారు. న్యూ ఇయర్ రిజల్యూషన్‌కు సంబంధించి ఆలోచింపజేసే ఓ ఫన్నీ ట్వీట్‌ను ఆనంద్ మహీంద్రా తన ఫాలోయర్ల కోసం షేర్ చేశారు. 


 

This is what it feels like mid-way into the first week of the New year… pic.twitter.com/ClzwcKCzmo

— anand mahindra (@anandmahindra) January 4, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు