బీహార్‌లోని బాగల్‌పూర్ జిల్లాలో ఓ బాలికపై రేపిస్ట్‌లు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. పదహారేళ్ల ఇంటర్ విద్యార్థిని ఇంట్లోకి శుక్రవారం నలుగురు దుండగులు చొరబడ్డారు. బాలిక తల్లిని గన్‌తో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి యత్నించారు. అయితే బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. ఘటనపై కేసు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో రష్మీ పోస్టు చేసింది. రోజుకో కొత్త కేసు నమోదవుతోంది. గతంలో జరిగిన ఘటనల కంటే ప్రస్తుతం జరిగే ప్రతీ ఘటన ఎంతో భయానకంగా ఉంటోంది. మగాళ్లమని రెచ్చిపోతూ అఘాయిత్యాలకు పాల్పడే కామాంధుల పురుషాంగాలను కోసేయాలి. లేదంటే ఒక్క రాత్రిలోనే స్త్రీ జాతి అంతరించిపోతుంది. అలా చేసినప్పుడే మానవాళికి మహిళ విలువ తెలుస్తుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.