ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో గురువారం రాత్రి మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్‌యూ వీసీని తొలగించాలంటూ విద్యార్ధులు రాష్ట్రపతి భవన్ వైపు దూసుకురావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్రిభవన్ వద్ద పోలీసులు, విద్యార్ధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్‌యూ ఘటనపై విచారణకు వైస్ ఛాన్సలర్ ఎం.జగదీశ్ కుమార్ ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఐదుగురు ప్రొఫెసర్లు సుశాంత్ మిశ్రా, మజహర్ ఆసిఫ్, సుధీర్ ప్రతాప్ సింగ్, సంతోష్ శుక్లా, భస్వతీ దాస్ సభ్యులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి జేఎన్‌యూ రిజిస్ట్రార్ డా. ప్రమోద్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
జనవరి 5 ఆదివారం సాయంత్రం జేఎన్‌యూలోకి ముసుగులతో ప్రవేశించిన సుమారు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, ఇనుపరాడ్లతో విద్యార్ధులు, అధ్యాపకులపై దాడికి పాల్పడి పాల్పడ్డారు. ఈ ఘటనలో విద్యార్ధి సంఘం నేత అయిషే ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు.