రాహుల్ పాదయాత్ర ఆపాలా? ఏదైనా ఎయిర్‌పోర్టుకెళ్లి చూడండి.. కాంగ్రెస్ కౌంటర్

బుధవారం, 21 డిశెంబరు 2022 (15:22 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మాన్సుక్ మాండవీయకు కాంగ్రస్ ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఉచిత సలహా ఇచ్చేముందు... ఏదైనా విమానాశ్రయానికి వెళ్లి చూడాలని, ఏ ఒక్క విమానాశ్రయంలో మాస్క్ పెట్టుకోవాలని అడగడం లేదని కాంగ్రెస్ నేత పవన్ ఖెరా ఘాటుగా రిప్లై ఇచ్చారు. 
 
అంతేకాకుండా, జన్ ఆకర్ష్ యాత్ర చేస్తున్న రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియాకు ఇదే సలహా ఇస్తూ లేఖ రాయగలరా? అంటూ మాండవీయను ఆయన ప్రశ్నించారు. రాహుల్ యాత్రకు వస్తున్న ప్రజా ఆదరణను చూసి కేంద్ర ఓర్చుకోలేకపోతోందని, అందుకే కోవిడ్ ప్రోటోకాల్ పేరుతో యాత్రను వాయిదా వేసుకోవాలని సూచిస్తుందన్నారు. 
 
కేవలం రాహుల్ యాత్రపైనే దృష్టిని కేంద్రీకరించిన కేంద్రం రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల్లో బీజేపీ నేతలు చేపట్టిన యాత్రలు కనిపించడం లేదా అని నిలదీశారు. దీనికి కారణం ఈ యాత్రలకు పెద్దగా జనాకర్షణ లేకపోవడంతో ఇందుకు కారణమన్నారు. రాహుల్ గాంధీకి లేఖ రాయడమంటే ఆయనను, భారత్ జోడో యాత్రను టార్గెట్ చేసుకోవడమేనని పవన్ ఖెరా అన్నారు. 
 
"భారత్ జోడో యాత్రకు ఎంతో ఆదరణ లభిస్తుండటం, ప్రజలు భారీగా స్వచ్ఛంధంగా పాల్గొనడం చూస్తున్నాం. కానీ, అసలు కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయా? ఏ విమానాశ్రయానికి అయినా వెళ్లి చూడండి. మాస్క్ ధరించాలని ఎవరూ అడగరు. ఎందుకని ప్రజా రవాణఆలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయడం లేదు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు మాత్రం ఈ నిబంధనలు ఎందుకు? పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసుకున్నారా? అని ఖెరా ప్రశ్నల వర్షం కురిపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు