ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల శివాజీ స్మారకస్థూపానికి ప్రధాని మోడీ భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో భాగంగా శివాజీ సైన్యంలో సేవలు అందించిన ముస్లింల గురించి మాట్లాడకపోవడానికి కారణమేమిటని అడిగారు.
శివాజీ మెమోరియల్ కోసం రూ.3,600 కోట్లను వినియోగించడంపై తమ అభ్యంతరం లేదని, కానీ.. శివాజీ గొప్పతనం గురించిన మాట్లాడిన మోడీ ముస్లింల గురించి ఎందుకు ప్రస్తావించలేదని తెలిపారు. శివాజీ సైన్యంలో ముస్లింలు కూడా ఉన్నారని, శివాజీ కోసం పలువురు ముస్లింలు ప్రాణాలు కూడా ప్రాణాలు కోల్పోయారని ఓవైసీ గుర్తు చేశారు. శివాజీ ఎన్నడూ రైతుల భూములను లాక్కోలేదని ఓవైసీ అన్నారు.