జ్ఞానవాపి మసీదు కింద దేవాలయం ఉన్నట్టు ఏఎస్ఐ నివేదికలో లేదు.. ముస్లిం పర్సనల్ లా బోర్డు

వరుణ్

ఆదివారం, 28 జనవరి 2024 (14:20 IST)
జ్ఞానవాపి మసీదు కింద దేవాలయం ఉన్నట్టు ఏఎస్ఐ నివేదికలో పేర్కొనలేదని, కొన్ని మతవాద సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టించి, సమాజంలో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాయని ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు కింద దేవాలయం ఉన్నట్టు భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) గుర్తించినట్టు వార్తలపై ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది. మసీదు కింద దేవాలయం ఉన్నట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. ఏఎస్ఐ నివేదికలో ఈ విషయం పూర్తి స్థాయిలో నిర్ధారణ కలేదని ఇండియా ముస్లిం లా బోర్డు వ్యాఖ్యానించింది. 
 
ఏఐఎమ్ పీఎల్‌బీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కామిస్ రసూల్ ఇలియాస్ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో ఏఎస్ఐ రిపోర్టు నిర్ణయాత్కమైన ఆధారం కాదని  అభిప్రాయపడ్డారు. కొన్ని మతవాద సంస్థలు జ్ఞానవాపి మసీదు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. సమాజంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 
 
అంతకుముందు హిందు పిటిషనర్ల తరపున న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ, ఏఎస్ఐ రిపోర్టును ప్రస్తావించారు. 17వ శతాబ్దంలో ఓ హిందూదేవాలయాన్ని కూలగొట్టి జ్ఞానవాపి మసీదు నిర్మించారనే ఆధారాలు ఉన్నట్టు ఏఎస్ఐ గుర్తించిందని పేర్కొన్నారు. కాగా. ఏఎస్ఐ రిపోర్టును తన లీగల్ టీం సాయంతో పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత దీనిపై స్పందించనని జ్ఞానవాపి మసీదు వ్యవహారాలు చూస్తున్న అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ (ఏఐఎమ్సీ) పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు