దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వివరాలను పరిశీలిస్తే, శీలాపథార్ పట్టణానికి చెందిన అకన్ సైకియా అనే 50 ఏళ్ల వ్యక్తి 2019 సెప్టెంబరులో భార్యను వేధించిన కేసులో జైలుకెళ్లాడు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వుల మేర అకన్ సైకియాను జైలు అధికారులు బెయిలుపై విడుదల చేశారు.
శీలాపథార్ పట్టణానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఆమె మృతదేహాన్ని ఈ నెల 17వతేదీన సీమెన్ నది తీరంలో ఖననం చేశారు. ఈ నెల 18వతేదీన అకన్ సైకియా సమాధిని తవ్వి బాలిక మృతదేహాన్ని బయటకు తీసి, మృతదేహంపై అత్యాచారయత్నం చేశాడు.
నదీ తీరంలో బాలిక మృతదేహంపై అత్యాచార యత్నం చేస్తుండగా, చేపలు పట్టేందుకు వచ్చిన మత్స్యకారులు చూసి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడు అకన్ సైకియాపై ఐపీసీ సెక్షన్ 306, 377, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు.
కాగా అకన్ సైకియా బాలికను లైంగికంగా వేధించినందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆత్మహత్య చేసుకున్నాక కూడా మృతదేహాన్ని కూడా వదలకుండా దాన్ని వెలికితీసి అత్యాచార యత్నం చేశాడని ప్రజల్లో వదంతులు వ్యాపించడంతో తాము దీనిపై దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ప్రదీప్ కొన్వార్ చెప్పారు.