పశ్చిమ బెంగాల్‌లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రలోని మూడు జిల్లాల్లో సోమవారం పిడుగులు పడటంతో 11 మంది మృతి చెందారు, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపాటుకు బంకురా, పూర్బా బర్ధమాన్ జిల్లాల్లో ఐదుగురు మృతిచెందగా, హౌరా జిల్లాలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. వ్యవపాయ పనులు చేస్తుండగా పిడుగు పడటంతో మృతి చెందినట్లు తెలిపారు.
అలాగే అస్సాంలో వరదల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకు మరణించిన వారిసంఖ్య 104కు చేరుకుంది. వీరిలో కొండచరియలు విరిగపడి 26 మంది చనిపోయారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ 28 జిల్లాల్లో వరద భీభత్సం సృష్టిస్తోంది. దీంతో దాదాపు 40 లక్షలమంది నిరాశ్రయులు అయ్యారు.