మొండి బకాయిల రైటాఫ్ అంటే ఏంటో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను రాహుల్ అడిగి తెలుసుకోవాలని నిర్మలా సీతారామన్ చురకలంటించారు. రిజర్వు బ్యాంకు నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనింగ్ ప్రకారమే మొండి బకాయిలకు కేటాయింపులు జరిగాయని, ఆ తర్వాతే బ్యాంకులు ఎన్‌పీఏలను రైటాఫ్ చేస్తాయని చెప్పారు.
లోన్ తీసుకున్న వారి నుంచి డబ్బుల రికవరీని మాత్రం కొనసాగిస్తాయని, ఇది రుణ మాఫీ చేసినట్లు కాదని వివరించారు. రుణమాఫీ, రైటాఫ్ మధ్య తేడాలు తెలుసుకుని రాహుల్ మాట్లాడాలని ఆమె విమర్శించారు. రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ చెల్లించని వారిని మాత్రమే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు అంటారని ఆమె వివరించారు.