వివరాల్లోకి వెళితే.. పశ్చిమ యూపీలోని బాగ్పత్ జిల్లా, సురోర్పూర్ కలాన్ గ్రామంలో ఓ యువతిని కొందరు ఏజెంట్లు అమ్మేశారు. ఈ నెల 16న ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో కూలీగా పనిచేసే ముకేష్ అనే వ్యక్తికి సదరు యువతిని రూ.22 వేలకు ఇద్దరు బ్రోకర్లు వేలంపాటలో విక్రయించారు. అడ్వాన్సు కింద ముకేష్ వారికి రూ.17,500 చెల్లించి తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
ముకేష్ కేసును విచారిస్తుండగా యువతి వేలంపాట విక్రయ ఘటన తమ దృష్టికి వచ్చిందని బాగపత్ సర్కిల్ అధికారి దిలీప్ సింగ్ చెప్పారు. అలాగే ముకేష్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్టవిరుద్ధంగా వధువుల అక్రమ రవాణా, విక్రయం కిందం ఇద్దరు ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.