సవతి కుమార్తెపై కరాటే మాస్టర్ (తండ్రి) లైంగిక దాడి... చితక్కొట్టిన స్థానికులు... ఎక్కడ?

శనివారం, 20 మే 2017 (12:34 IST)
కామంతో కళ్ళుమూసుకుని పోయిన కామాంధులకు వావివరుసలు, కన్నబిడ్డలు అనే విషయం కూడా గుర్తుకు రావడం లేదు. తాజా, తన భార్య మొదటి భర్త ద్వారా పుట్టిన 14 యేళ్ల బాలిక (సవతి కుమార్తె)పై కరాటే మాస్టర్‌గా ఉన్న సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలో జరిగింది. ఈ విషయాలను పరిశీలిస్తే... 
 
బెంగళూరు నగరంలోని బెళ్లందూరు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన జానకి అనే మహిళ.. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తన 14 ఏళ్ల కుమార్తెతో కలిసి బెళ్లందూరు సమీపంలో నివాసం ఉంటున్నది. కరాటే మాస్టర్ రామ్ రాజ్ అనే వ్యక్తిని జానకి రెండో పెళ్లి చేసుకుంది. రామ్ రాజ్ కూడా వీరితో కలిసే ఉంటున్నాడు.
 
జానకి గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది. అలాగే, రామ్ రాజ్ కరాటే మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం జానకి ఉద్యోగానికి వెళ్లగా, ఇంట్లో కుమార్తె మాత్రం ఒంటరిగా ఉన్నది. ఇదే అదునుగా భావించిన రామ్ రాజ్.. సవతి కుమార్తెపై అత్యాచారానికి యత్నించాడు. 
 
ఒక్కసారి ఏం జరుగుతుందో తెలియని ఆ బాలిక.. గట్టిగా కేకలు వెయ్యడంతో ఇరుగుపొరుగువారు వచ్చిన బాలికను రక్షించి రామ్ రాజ్‌ను చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. విషయం తెలుసుకున్న బెళ్లందూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రామ్ రాజ్ ను అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి