హమ్మయ్య.. రియన్నా ఓటు హక్కును వినియోగించుకుంది..

గురువారం, 11 ఏప్రియల్ 2019 (09:44 IST)
దేశ వ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. బెంగళూరుకు చెందిన రియన్నా ఓటు హక్కును వినియోగించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. రియన్న ఓటేయడంలో ప్రత్యేకత ఏముంది అనే కదా ఆలోచిస్తున్నారు. వుందండి.. ఆమె ఓటు హక్కును వినియోగించడంలో ప్రత్యేకత వుంది. 
 
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన రియన్నా తనకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచీ ఓటు కోసం దరఖాస్తు చేస్తూనే ఉంది. 11 సార్లు ఆమె దరఖాస్తును అధికారులు చెత్తబుట్టలో పడేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైన తన ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో రియన్నా మళ్లీ దరఖాస్తు చేసుకుంది. కానీ ఈసారి ఆమెకు ఓటరు కార్డును అధికారులు ఇచ్చేశారు. 
 
ట్రాన్స్‌జెండర్ల కూడా ఓటు వేసే హక్కు ఉందని మర్చిపోయిన అధికారులు ఆ విషయాన్ని మరిచి ప్రతీసారి ఆమె దరఖాస్తును తిరస్కరించారు. తాజాగా మాత్రం ఆమెకు ఓటరు కార్డు మంజూరు చేశారు. తొలిసారి ఓటు వేయబోతున్న రియన్నా బెంగళూరు సెంట్రల్‌లో ఓటు హక్కు వినియోగించుకుంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడంపై రియన్నా హర్షం వ్యక్తం చేసింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు