నోట్ల రద్దుతో బ్యాంకు సిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారు. మరోవైపు డబ్బు కోసం ప్రజలు లైన్లలో గంటల పాటు నిల్చుంటున్నారు. అలా నోట్ల కోసం లైనులో నిల్చుని ఓ వైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. తాజాగా మూడు రోజుల పాటు ఏకధాటిగా విధుల్లో పాల్గొన్న ఓ బ్యాంకు మేనేజర్ గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. హర్యానాలోని రోహ్తక్ కోపరేటివ్ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది.
డబ్బులిస్తూ ఇస్తూ ఇస్తూ బ్యాంక్ మేనేజర్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనను చూసిన ఆ బ్యాంకుకు వచ్చిన ప్రజలంతా కంటతడిపెట్టించింది. రోహ్తక్ సహకార బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేష్ కుమార్.. పని ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల నుంచి రాత్రి పూట కూడా ఆఫీస్‌లోనే గడుపుతున్నారు. ఆయనకు గుండెజబ్బు కూడా ఉండటంతో.. బుధవారం ఆయన గది తలుపులు తట్టినా తీయకపోవడంతో పోలీసుల సాయంతో గది తలుపులు పగులకొట్టి లోనికెళ్లారు. కానీ అంతలోనే రాజేష్ కుమార్ మృతి చెందినట్లు గుర్తించారు.