Satwik Varma, Preeti Neha
కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు భీమ్స్, దర్శకులు అశోక్.జి, అనుదీప్ కె.వి, భాను బోగవరుపు, కాసర్ల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐబిఎమ్ మెగా మ్యూజిక్ ఆడియో కంపెనీ ను లాంచ్ చెయ్యడం విశేషం.