పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశంగా కరోనా : బెంగాల్ సర్కారు నిర్ణయం
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (12:23 IST)
ప్రపంచాన్ని వణికించి, అనేక మంది ప్రాణాలను హరించిన కరోనా వైరస్‌ను ఓ పాఠ్యాంశంగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యార్థులకు కరోనా అంశాన్ని ఒక పాఠ్యాంశంగా అమలు చేయనున్నట్టు తెలిపారు.
ఇందులో కరోనా వైరస్‌కు సంబంధించిన పూర్తి అంశాలను పాఠశాలల్లో పిల్లలకు బోధించనున్నారు. ఈ మేరకు బంగాల్ ప్రభుత్వం.. తన అనుబంధ పాఠశాలల్లో ఈ సబ్జెక్టును పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయం తీసుకుంది.
మహమ్మారి కరోనా యావత్ ప్రపంచాన్ని ఎంత అల్లకల్లోలం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే విషయాన్ని విద్యార్థులకు ఓ పాఠ్యాంశంలా బోధించాలని బెంగాల్ సర్కారు నిర్ణయించింది.
ఇకపై బెంగాల్ ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లోని 11వ తరగతిలో 'హెల్త్ అండ్ ఫిజకల్ ఎడ్యుకేషన్' సబ్జెక్ట్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన పూర్తి అంశాలను బోధించనున్నారు. ఇందులో కరోనా అంటే ఏమిటి? అది ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది? వైరస్ లక్షణాలేమిటి? క్వారంటైన్‌కి సంబంధించిన తదితర వివరాలు పూర్తిగా ఉంటాయి.