వెస్ట్ బెంగాల్ ప్రజలకు 'స్వీట్' న్యూస్

మంగళవారం, 14 నవంబరు 2017 (16:46 IST)
వెస్ట్ బెంగాల్ వాసులకు ఓ తీపివార్త. గత కొంతకాలంగా వెస్ట్ బెంగాల్, ఒడిషాల మధ్య ఓ స్వీట్‌పై జరుగుతున్న పోరులో బెంగాలే విజయం సాధించింది. ఆ పోరు ఏంటో కాదు... నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే రసగుల్ల. ఈ స్వీట్ తమదంటే తమదేనని ఈ రెండు రాష్ట్రాలు 2015 నుంచి యుద్దానికి దిగాయి. 
 
ఇది కాస్తా వివాదంగా మారటంతో దీనిపై స్పెషల్‌గా ఓ కమిటీని కూడా ఆ ప్రభుత్వం నియమించింది. రసగుల్లపై వాదనల్లో భాగంగా ఈ స్వీట్‌ను తొలిసారి 1868లో నబీన్ చంద్రదాస్ అనే ఓ స్వీట్ వ్యాపారి (తయారీదారు) తయారు చేశాడని బెంగాల్ ప్రభుత్వం వాదించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ రసగుల్లా స్వీట్ బెంగాల్‌దేనని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) రిజిస్ట్రి మంగళవారం స్పష్టం చేసింది. అయితే జీఐ పేటెంట్ బెంగాల్‌కే వచ్చిందని, దీనిపై రీసెర్చ్ చేసిన తర్వాత రసగుల్ల బెంగాల్‌కు చెందినదే అని తాము నిర్ధారించుకున్నట్టు జీఐ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ చిన్నరాజా నాయుడు చెప్పారు. 
 
ఈ విజయాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెలబ్రేట్ చేసుకున్నారు. బెంగాల్‌కు స్వీట్ న్యూస్.. రసగుల్ల విషయంలో బెంగాల్‌కు జీఐ స్టేటస్ ఇవ్వడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ స్వీట్ విక్టరీపై బెంగాల్‌లోని స్వీట్ షాపుల యజమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
 
 

Sweet news for us all. We are very happy and proud that #Bengal has been granted GI ( Geographical Indication) status for Rosogolla

— Mamata Banerjee (@MamataOfficial) November 14, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు