మనకు ఓటు వేయని ప్రజలపై విద్వేషం వద్దు : పంజాప్ సీఎం

బుధవారం, 16 మార్చి 2022 (16:46 IST)
"ముగిసిన ఎన్నికల్లో మనకు ఓటు వేయని ప్రజలపై కోసం, విద్వేషం చూపించవద్దని, వారిని మనం గౌరవించి తీరాల్సిందేనని, మీ అందరికీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు నా కృతజ్ఞతలు" అని పంజాబ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన భవంత్ మాన్ సింగ్ అన్నారు.
 
అయన బుధవారం పంజాబ్ రాష్ట్రంలోని భగత్ సింగ్ పుట్టిన గ్రామంలో నవన్ షహర్ జిల్లాలోని ఖాక్టర్ కలాన్ అనే గ్రామంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇంక్విలాల్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ నినాదంతోనే ఆయన తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించారు. 
 
ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తన సహచర ఎమ్మెల్యేలకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. "మనకు ఓటు వేయని ప్రజలపై కోపం, ద్వేషం చూపించవద్దు. వారినీ మనం గౌరవించి తీరాల్సిందే. మీ అందరికీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు నా కృతజ్ఞతలు" అని అన్నారు. 
 
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వేలాది మంది ప్రజలు ఆయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రమాణ స్వీకారానికి ఆయన పసుపు రంగు తలపాగా చుట్టుకుని రాగా, కేజ్రీవాల్, సిసోడియాలు కూడా ఇదే రంగు తలపాగాను ధరించడం గమనార్హం. 
 
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 సీట్లున్న పంజాబ్ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏకంగా 92 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్, బీజేపీ, ఇతర ముఖ్య పార్టీలకు చెందిన అభ్యర్థులను ఆప్ అభ్యర్థులు చిత్తుగా ఓడించారు. సంగ్రూర్ జిల్లా ధూరీ స్థానం నుంచి భగవంత్ మాన్ సింగ్ గెలుపొందారు. ఆయన పేరును ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆప్ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు