వందో రోజుకు చేరుకున్న భారత్ జోడో యాత్ర... 21న హర్యానాలోకి...

శుక్రవారం, 16 డిశెంబరు 2022 (12:53 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వందో రోజుకు చేరుకుంది. గత సెప్టెంబరు ఏడో తేదీన కన్నియాకుమారిలో మొదలైన ఈ యాత్ర ఇప్పటికే 2,600 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ రాష్ట్రంలో దిగ్విజయంగా సాగుతోంది. 
 
రాహుల్ గాంధీ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజస్థాన్ రాష్ట్రంలోని మీనా హైకోర్టు దౌసా నుంచి వందో రోజైన శుక్రవారం ఉదంయ 6 గంటలకు ఈ యాత్రను ప్రారంభించారు. 
 
కాగా, భారత్ జోడో యాత్ర వంద రోజులు మార్కు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాహుల్ కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. 
 
ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు. రాత్రి 7 గంటలకు లైవ్ కన్సర్ట్‌తో రాష్ట్ర కాంగ్రెస్ కచేరిని ఏర్పాటు చేసింది. దీనికి రాహుల్ గాంధీ హాజరవుతారు. 
 
కాగా, కన్నియాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించతలపెట్టిన భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7వ తేదీన కన్నియాకుమారిలో ప్రారంభమైంది. ఇప్పటివరకు తమిలనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కన్నియాకుమారిలోకి ప్రవేసించింది. రాజస్థాన్‌లో ప్రస్తుతం 12వ రోజు యాత్ర కొనసాగుతోంది. ఈ నెల 21వ తేదీ తర్వా హర్యానా రాష్ట్రంలోని అడుగుపెడుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు