ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడో కామాంధుడు. ప్రేమిస్తున్నానని చెప్పి బాలికపై పదేళ్ల పాటు లైంగికంగా దాడి చేశాడు. చివరకు ఆ నిందితుడికి కర్ణాటకలోని బీదర్ జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఐదువేల రూపాయల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. ఓ బాలికపై పదేళ్ల పాటు ప్రేమిస్తున్నానని మారుతి అనే కామాంధుడు మోసం చేశాడు.
ఈ లైంగిక దాడుల కారణంగా తొమ్మిది సార్లు ఆమె గర్భవతి అయ్యింది. కానీ మారుతి ప్రతిసారీ అబార్షన్ చేయించాడు. అయితే పదోసారి ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టడం ఇష్టంలేదని మారుతి ఆ బిడ్డను అనాథ శరణాలయానికి ఇచ్చేశాడు. దీంతో బాధితురాలు ఔరద్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2002లో స్కూల్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్డీఎమ్సీ) ప్రెసిడెంట్‍గా పనిచేసిన మారుతి (40) 14 ఏళ్ల అమ్మాయిని ట్రాప్‌లో పెట్టాడు. ఆమెను ప్రేమ పేరుతో మోసం చేశాడు. 34 ఏళ్ల వ్యక్తి తమ కుమార్తెను వివాహం చేసుకుంటానని చెప్పడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. పెళ్ళికి తర్వాత చదివిస్తానని నమ్మపలికాడు. ఇందుకు బాలిక కూడా సమ్మతించడంతో మారుతి ఇంట్లోనే వివాహం జరిగింది.