విద్వేషం మీద ప్రేమ, అహంకారంపై వినయం సాధించిన గెలుపు: రాహుల్

ఆదివారం, 8 నవంబరు 2015 (14:18 IST)
బీహార్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికైనా గౌరవించాలని సలహా ఇచ్చారు. ప్రచారాలు, మాటలు కట్టిపెట్టి పని మొదలు పెట్టాలని హితవు పలికారు. ముఖ్యంగా దేశ రైతాంగం బాధలు తెలుసుకోవాలని, యువత మనోభావాలను గుర్తించాలని ఆయన కోరారు. 
 
ఈ ఎన్నికల ఫలితాలపై రాహుల్ మీడియాతో మాట్లాడుతూ ఇది బీహార్ ప్రజలుసాధించిన విజయమన్నారు. ఈ విజయం కోసం కృషిచేసిన మహాకూటమి నేతలకు, ఇతర నేతలకు, ఆ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలుపుతున్నట్టు రాహుల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఇది విభజిత రాజకీయాలపై ఏకత్వం సాధించిన విజయంగా అభివర్ణించారు. 
 
ఇది విద్వేషం మీద ప్రేమ, అహంకారం మీద వినయం సాధించిన గెలుపుగా ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా, ఈ తీర్పుతో దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం విభజించలేదని తేటతెల్లమైందన్నారు. ప్రజల కోసం మీరిచ్చిన వాగ్ధానాలను చూడాలని రాహుల్ గాంధీ కోరారు.

వెబ్దునియా పై చదవండి