ముఖ్యమంత్రి హోదాలో ఆదివారం నితీశ్ కుమార్ తన స్వగ్రామమైన భకిత్యాపూర్‌కు వెళ్లారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా ఖ్యాతి గాంచిన షిల్ భద్ర యాజీ విగ్రహాన్ని స్థానిక ఆస్పత్రిలో ప్రతిష్టించారు. ఈ విగ్రహావిష్కరణకు సీఎం నితీశ్ వచ్చారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన నివాళులు అర్పిస్తుండగా, ఓ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని వేదికపైకి ఎక్కి ముఖ్యమంత్రిపై దాడి చేశారు.
ఈ ఘటనతో భద్రతా సిబ్బందితో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది ముందుకొచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ యువకుడు మతిస్థిమితం లేనివాడిగా గుర్తించారు. అయితే, ఎంతో భద్రత ఉండే సీఎంపై ఈ తరహా దాడి జరగడం కలకలం రేపింది.