సోమవారం రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎన్ఆర్ఐల వివాహ నమోదు బిల్లు 2019 ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎన్నారైలు భారతదేశంలోని మహిళలను లేదా ఎన్నారై మహిళలను వివాహం చేసుకున్నట్లయితే, వివాహమైన 30 రోజులలోపు రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే వారి పాస్‌పోర్ట్ రద్దు చేయబడుతుంది.
అంతేకాకుండా ఇందులో దోషులుగా నిర్ధారణ అయితే, వారి ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా కోర్టుకు ఉంటుంది. ఎన్నరైల చేతుల్లో పెళ్లి పేరుతో మోసపోతున్న మహిళలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. భారతదేశంలో పెళ్లి చేసుకుంటే ఇక్కడి అధికారుల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి లేదా విదేశాలలో పెళ్లి చేసుకునేట్లయితే అక్కడి అధికారులతో రిజిస్టర్ చేయించుకోవాలి.