తనపై పార్టీ చర్య తీసుకుందని, మరి తన నాలుక కోస్తామని, తల తీస్తామని హెచ్చరించిన బీఎస్పీ కార్యకర్తలపై మాయావతి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులకు తాను సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 'నేను మాయావతిని పోల్చిన తీరు అభ్యంతరకరమైనదేనని ఒప్పుకుంటున్నాను. కానీ, ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు ఇవ్వడం మాయవతి స్టయిల్. ఆమెకు సారీ చెప్పమన్నారు. అదే చేశాను కూడా' అని దయాశంకర్ పేర్కొన్నారు.