ఆ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలుకనున్న నరేంద్ర మోడీ!

బుధవారం, 18 మే 2016 (17:18 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పలువురు సీనియర్, జూనియర్ మంత్రులు ఉన్నారు. వీరిలో పలువురి పనితీరు సంతృప్తికరంగా లేదనే ప్రచారం ఉంది. ఇలాంటి వారిని తొలగించనున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. 
 
అయితే, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో అసోంలో మాత్రం భారతీయ జనతా పార్టీ గెలుపొందవచ్చని పేర్కొన్నాయి. ఇదే జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర క్రీడల మంత్రి శర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రి అవుతారని సమాచారం. ఆ స్థానాన్ని మరొకరితో భర్తీ చేయక తప్పదు. 
 
అదేసమయంలో పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేని పలువురు మంత్రులకు కూడా ఉద్వాసన చెప్పాలని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, సూక్ష్మ, చిన్నతరహా, మధ్య తరహా సంస్థల సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్‌‌లు ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి