భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆమె గుండెపోటుతో స్వగృహంలోనే కుప్పకూలారు. ఆమెకు గుండెపోటు రావడంతో వెనువెంటనే ఎయిమ్స్ కి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆమె వయసు 67 సంవత్సరాలు.