ముంబై: అత్యాచారం కేసులో సెటిల్మెంట్: గర్భవతికి రూ.10లక్షల నష్టపరిహారం!

గురువారం, 28 జులై 2016 (09:05 IST)
అత్యాచారం కేసులో సెటిల్మెంట్ వ్యవహారం ముంబైలో ఆసక్తికరంగా మారింది. దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో అత్యాచారం కేసులో బాధితురాలైన ఓ యువతి రేపిస్టుతోనే సెటిల్మెంట్ చేసుకుని కేసును కోర్టు కొట్టేశాలా చేసింది. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు రేపిస్టు అంగీకరించడంతో ముంబయి హైకోర్టు కూడా కేసును కొట్టివేస్తూ సంచలనాత్మక తీర్పు వెలువరించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబయి నగరానికి చెందిన 23 ఏళ్ల ఓ యువతిని పూణేకు చెందిన 30 ఏళ్ల యువకుడు అత్యాచారం జరిపాడు. దీంతో బాధితురాలు ప్రస్తుతం ఆమె గర్భం ధరించింది. దీంతో చేసేది లేక రేప్ బాధితురాలు రేపిస్టు నుంచి రూ. 10లక్షల రూపాయల నష్టపరిహారం తీసుకునేందుకు అంగీకరించింది. 
 
రేపిస్టు ఇచ్చే పదిలక్షల రూపాయల డబ్బును యువతి పుట్టబోయే బిడ్డ పేరిట జమ చేయాలని హైకోర్టు జస్టిస్ అభయ్ఓకా, జస్టిస్ అమ్జద్ సయీద్ లతో కూడిన ధర్మాసనం అసాధారణ తీర్పునిచ్చింది.

వెబ్దునియా పై చదవండి