లాక్డౌన్ కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. ఎనిమిది నెలల గర్భిణితో పాటు.. ఓ చంటి బిడ్డను తోపుడు బల్లపై ఓ భర్త ఏకంగా 700 కిలోమీటర్ల మేరకు నడక మార్గంలో నడిచి సొంతూరికి చేరుకున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇపుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సూట్‌కేసుపై బిడ్డను పడుకోబెట్టి దాన్ని లాగుకుంటూ ఓ మహిళ 800 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ సొంతూరుకు చేరిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యం ఆగ్రా సమీపంలోని ఓ రహదారిపై కనిపించింది.
నిప్పులు కక్కే ఎండలో.. తమ బిడ్డలను భుజాలకు వేసుకుని, కాళ్లకు పని చెబుతున్న కార్మికుల కష్టాలు వర్ణాణతీతం. నెత్తిన సంచి.. భుజంపై బిడ్డ.. చేతుల్లో మరిన్ని బ్యాగులను పట్టుకుని కార్మికులు నడక సాగిస్తున్న దృశ్యాలను చూస్తుంటే.. హృదయం ధృవీకరించాల్సిందే.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ హృదయ విదారక సంఘటన ఒకటి వెగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన ఓ మహిళ కొన్నాళ్ల క్రితం పంజాబ్‌కు వలస వెళ్లింది. లాక్డౌన్ కారణంగా అన్ని పనులు నిలిపివేడయంతో ఉపాధి కోల్పోయింది. దీంతో సదరు మహిళ.. తన సూట్‌కేసుపై బిడ్డను పడుకోబెట్టి.. దాన్ని లాగుకుంటూ.. 800 కిలోమీటర్ల మేర నడిచింది.