మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోణీ చేసింది..

శనివారం, 20 మే 2023 (13:56 IST)
మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోణీ చేసింది. మహారాష్ట్ర వార్డు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకొని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన కేసీఆర్ పార్టీ తెలంగాణకు ఆవల తొలిసారి గెలుపును రుచి చూసింది. 
 
మహారాష్ట్రలో ఓ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన అభ్యర్థి విజయం సాధించారు. ఔరంగాబాద్ సమీపంలోని గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు గురువారం ఉప ఎన్నిక జరగ్గా నిన్న ఫలితం వెలువడింది. 
 
బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో గెలుపు సంబురాలు అంబరాన్నంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు