కేంద్ర ఆర్థికమంత్రిగా తెలుగింటి కోడలు నిర్మాలా సీతామన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. స్వతంత్ర భారతావనిలో అత్యధికసార్లు వార్షిక బడ్జెట్‌ను సమర్పించిన మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. అదేసమయంలో ఫిబ్రవరి ఒకటో తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్‌ను దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆమె ప్రత్యేకమైన చీరను ధరించి లోక్‌సభకు వచ్చారు. ఆ చీర పేరు మధుబని.
గతంలో పద్మ అవార్డు గ్రహీత, దళిత కళాకారిణి దులారీ దేవి ప్రతిభకు నివాళిగా మధుబని చీరను ధరించారు. దులారీ దేవి గత 2021లో పద్మ అవార్డు గ్రహీత, మిథిలా ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో క్రెడిట్ ఔట్రీచ్ ఫంక్షన్ కోసం ఆర్థిక మంత్రి మధుబని సందర్శించినప్పుడు, అతను దులారీ దేవిని కలుసుకున్నారు. బీహార్‌లోని మధుబని కళ గురించి లోతుగా తెలుసుకున్నారు. ఆ సమయంలో దులారీ దేవి బహుమతిగా ఇచ్చిన చీరను నిర్మలా సీతారమన్ శనివారం ధరించి సభకు చ్చారు. కాగా, ఈ యేడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో బీహార్ ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా ఇలా వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.