మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే ప్రతినిధిగా చెప్పుకునే పర్వేశ్ శుక్లాకు ఆ రాష్ట్ర అధికారులు తీవ్రమైన శిక్ష విధించారు. ఏకంగా అతని ఇంటిని కూల్చివేశారు. తమ ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని చూసిన అతని కుటుంబ సభ్యులు హతాశులైపోయారు. తమ కుమారుడిపై కుట్ర పన్నారంటూ నిందితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పైగా, ఎపుడో జరిగిన పాత వీడియోను ఉద్దేశ్యపూర్వకంగా బయటకు తీశారని పేర్కొంటున్నారు.
తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అతడి ఇంటిని కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు. ప్రస్తుతం పర్వేజ్ శుక్లా రేవా కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ఆదేశాలతో ఆయనపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. పైగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ హోం శాఖ స్పష్టం చేసింది.