డెబిట్‌ కార్డుదారులకు ఎస్‌బిఐ బంప‌ర్ ఆఫ‌ర్‌

మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:11 IST)
దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బిఐ) డెబిట్‌ (ఏటిఎం)కార్డు కలిగిన వినియోగదారులకు తీపికబురును అందించింది.

తమ బ్యాంక్‌ డెబిట్‌ కార్డు కలిగి ఉన్న వారికి నెల వాయిదా చెల్లింపు (ఇఎంఐ) విధానంలో రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు ఎస్‌బిఐ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 
 
దేశవ్యాప్తంగా 40,000కుపైగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్ధల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పిఒఎస్‌) వద్ద ఎస్‌బిఐ డెబిట్‌ కార్డుదారులు వస్తువులను కొనుగోలు చేసి నెల వాయిదాల రూపంలో చెల్లింపులు చేపట్టే వెసులుబాటు కల్పిస్తున్నామని ఎస్‌బిఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వెల్లడించారు. 
 
వస్తువుల కొనుగోలుకు అయ్యే మొత్తం తక్షణమే ఒకేసారి చెల్లించకుండా డెబిట్‌ కార్డుల ద్వారా కస్టమర్లు ఇఎంఐపై వాటిని కొనుగోలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. కనిష్టంగా ఆరు నెలల నుంచి 18 నెలలుగా వినియోగదారులు ఈఎంఐ గడువును ఎంపిక చేసుకోవచ్చని ఎస్‌బిఐ పేర్కొంది. 
 
మెరుగైన క్రెడిట్‌ హిస్టరీ కలిగిన కస్టమర్లందరూ వినిమయ రుణాలను పొందవచ్చని ఎస్‌బిఐ ఈ ప్రకటన పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు