బాంబే హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. పురుషులను 'నపుంసకుడు' అని పిలిస్తే వారి పరువుకు నష్టం కలిగించినట్లేనని, ఈ పదం మగవాళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని వ్యాఖ్యానించింది. పైగా, ఇలాంటి పదాలను ఉపయోగించి మగాళ్లను పిలిస్తే పరువు నష్టం దావా వేయొచ్చని తెలిపింది. ఓ విడాకుల కేసులో బాంబే హైకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది.
'అగౌరవ పరిచాలనే ఉద్దేశంతో ఆ పదాన్ని ఉపయోగించలేదు. మా పాప కూడా అధునాతన సంతాన చికిత్స ద్వారా జన్మించింది' అని అభ్యర్థనలో ఆమె వివరించారు. ఈ అభ్యర్థనపై జస్టిస్ సునిల్ శుక్రే విచారణ చేపట్టారు. వైద్య స్థితిని తెలియజేసేందుకే ఆ పదాన్ని ఉపయోగించినప్పటికీ.. దాంతో జరిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేకుండా ఉండలేమని పేర్కొంటూ ఇలాంటి పదాలను ఉపయోగించే వారు పరువునష్టం దావా కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.