సోమవారంనాడు సినిమా రంగంలో మూడు విషయాలు జరిగాయి. పెద్ద నిర్మాతలంతా ఎ.పి. మంత్రి దుర్గేష్ ను కలిసి సినిమారంగపై సమస్యలను ఏకరువుపెట్టారు. అదే సమయంలో హైదరాబాద్ లో చిన్న నిర్మాతలు యాక్టివ్ నిర్మాతల పేరుతో ఫిలింఛాంబర్ లో తమ సమస్యలు మీడియాముందు విన్న వించారు. మరో ప్రత్యేకత ఏమంటే.. 24 క్రాఫ్ట్ కు చెందిన ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని చిత్రపురిలో కార్మికుల కోసం కడుతున్న సర్ఫస్ అనే పేరుతో ట్విన్ టవర్సర్ కోసం శంకుస్థాపన చేశారు. ఈ మూడు సంఘటనలు ఈరోజు జరగడం విశేషమని చెప్పాలి.
ఇక ఎ.పి. గురించి చెప్పాలంటే, తెలుగు సినిమా అనేది ఒక్కటే అయినా ఎ.పి., తెలంగాణ విషయంలో ముఖ్యంగా నందిఅవార్డల విషయంలో భిన్నాభిప్రాయాలను నిర్మాతలు వ్యక్తం చేశారనీ, దానిపై మరోసారి చర్చించాల్సిన అవసరం వుందని ఎ.పి. మంత్రి దుర్గేష్ అన్నారు.
తెలుగు చలన చిత్రరంగంలోని పలు సమస్యలకు పరిష్కార దిశగా తొలి అడుగు నేడు పడింది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తో తెలుగు సినిమా నిర్మాతలు భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన భేటీలో గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల పై మంత్రి తో చర్చ, వివరాలు తెలుపిన నిర్మాతలు. వీటితో పాటు నంది అవార్డుల విషయంలో తెలంగాణ, ఆంధ్ర సెపరేట్ చేయాలని నిర్మాతలు సూచించారు. ఈ భేటీలో పాల్గొన్న నిర్మాతలలో బి వి ఎస్ ఎన్ ప్రసాద్, డి వి వి దానయ్య, కె ఎల్ నారాయణ, భరత్ ( ఛాంబర్ ప్రెసిడెంట్), నాగ వంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వ ప్రసాద్, బన్నీ వాసు, వంశీ ( uv creations), (Mythri Movies), వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి వున్నారు.
కందుల దుర్గేష్ మాట్లాడుతూ, పెద్ద చిన్న సినిమా అనేవాటికి తగిన పరిష్కారం దిశగా పాలనీ తేవాలని నిర్మాతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాకు ఇస్తున్న సహకారం గురించి తెలుగు సినిమా నిర్మాతలుప్రముఖులు హాజరై అభినందించారు. ఈ రాష్ట్రంలో ఏవిధంగా సినిమా అభివ్రుద్ధి వుండాలో సూచించారు. అలాగే 24 క్రాఫ్ట్ లో వున్న సమస్యలు, అభివ్రుద్ధి గురించి మా ముందుకు తీసుకువచ్చారు. ప్రత్యేక పాలసీ కూడా తీసుకురావాలని అన్నారు. అందుకే వాటన్నింటిపై సమగ్ర ఆలోచనతో ముందుకు రండి. సెప్టెంబ్ మొదటి వారంలో చంద్రబాబుతో మీటింగ్ ఏర్పాటు చేయగలనని చెప్పారు. షూటింగ్ కు మౌళిక సదుపాయాలు, రీరికార్డింగ్ థియేటర్ల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టికి తెచ్చారు.
నంది అవార్డులు
ఇప్పటికే నంది అవార్డులు, నంది నాటకోత్సవాలలో ప్రత్యేక సూచన చేయాలని సి.ఎం. కోరారు. దానిపై చర్చలు జరుగుతున్నాయి. వీటి విషయంలోనూ నిర్మాతలు కూడా ఆలోచించాలని చెప్పాం. నిర్మాతలందరూ కూడా మీమీ స్థాయి చర్చల్లో పాల్గొని పూర్తి వివరాలతో రమ్మని కోరాం.
తెలుగు సినిమా అనేది అటు ఆంధ్ర, తెలంగాణ లో అయినా ఒక్కటే అయినా నిర్మాతలు భిన్నాభిప్రాయాలు చెప్పారు. సినిమా అనేది బడ్జెట్ అనేది కీలకం. దానిపై కూడా విధానాల రూపకల్పన విషయంలో ఎలా వుండాలనేది కూడా త్వరలోనే దీనిపై పాలసీ తీసుకురావాలని చెప్పాం. ఉపముఖ్యమంత్రి కూడా తన సాయం చేస్తూ సినీ పరిశ్రమకు ఆదుకోవాలనే అభిప్రాయంతో వున్నారు.