అవినీతి కేసులో ఆధారాలు ధ్వంసం ; ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కేసు

వరుణ్

శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (10:55 IST)
అవినీతి కేసులో ఆధారాలను ధ్వంసం చేయడంతో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌తో పాటు ఆయన సబార్డినేట్ వైవీవీజే రాజశేఖర్‌పై తాజా కేసు నమోదైంది. ఓ ఎన్జీవో సంస్థ ఫిర్యాదుపై ఉత్తరాఖండ్ కోర్టు తీర్పు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎన్జీఓ సంస్థ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది.
 
దడకడ గ్రామానికి చెందిన ప్లెసెంట్ వ్యాలీ ఫౌండేషన్ ఈ ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 14న అధికారులు.. నలుగురు ఆగంతుకులను తమ వద్దకు పంపించిన బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము నిర్వహిస్తున్న ఓ స్కూలు వచ్చిన ఆ నలుగురు ఎన్జీఓ జాయింట్ సెక్రెటరీ ఆఫీసులోని ఫైళ్లు, రికార్డులు, పెన్‌డ్రైవల్‌లను తీసుకెళ్లారని పేర్కొంది. ఓ స్కామ్ అధికారులు పాత్రకు సంబంధించిన ఆధారాలు ఇందులో ఉన్నాయని ఎన్జీఓ పేర్కొంది.
 
అధికారులు పంపించిన ఆగంతుకులు బెదిరింపులకు దిగారని ఎన్జీఓ వెల్లడించింది. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఇతర వేదికల్లో చేసిన అవినీతి ఫిర్యాదులు వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేశారని ఎన్జీఓ పేర్కొంది. ఎన్జీఓ జాయింట్ సెక్రెటరీ వారిని ప్రతిఘటించగా ఆగంతుకులు అక్కడున్న డెస్క్‌లోని రూ.63 వేల నగదు బలవంతంగా తీసుకెళ్లిపోయారని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, తమ వెంట తెచ్చుకున్న డాక్యుమెంట్‌‍పై సంతకం చేయాలని ఆగంతుకులు జాయింట్ సెక్రెటరీని బలవంతం చేసే ప్రయత్నం చేశారని కూడా పేర్కొంది. ఎన్జీఓ సంస్థ ఫిర్యాదును స్వీకరించిన అల్మోరా కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు