ఇటుక బట్టీలో పేలుడు... ఏడుగురు కార్మికుల మృతి

శనివారం, 24 డిశెంబరు 2022 (13:16 IST)
బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో పేలుడు చోటుచేసుకోవడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటుక బట్టిలో చిమ్నీ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
బీహార్ రాంఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారిగిర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అనేకమంది కార్మికులు గాయాల పాలైనట్లు పోలీసులు తెలిపారు.
 
ప్రమాద ప్రాంతంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు