నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇంట్లో సీబీఐ అధికారుల దాడులు జరిగినట్లుగా వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం.. బుధవారం అర్థరాత్రి వరకు సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
దీనిపై రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ ఈ వ్యవహారంపై విచారణ జరిపి పలు ఆధారాలతో 2018 జనవరి 21వ తేదీన వాకాటిని అరెస్ట్ చేశారు. నాటి నుంచి నారాయణ రెడ్డి బెంగళూరులోని పరప్పణ అగ్రహరం జైలులో ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో సీబీఐ పలు మార్లు ఆయన నివాసంలో దాడులు నిర్వహించింది. తాజాగా నారాయణరెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో సీబీఐ దాడులు సంచలనం సృష్టించాయి.