ఆంధ్రా మంత్రుల వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్.. అచ్చెన్నాయుడు పశ్చాతాపం

గురువారం, 18 జూన్ 2015 (21:49 IST)
ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. నోటికి వచ్చినట్లు ఎలా మాట్లాడుతారని మండిపడినట్టు సమాచారం. 
 
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కేంద్రం స్పందించిన తీరును చీఫ్ సెక్రటరీ ఏపీ సర్కారుకు చేరవేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
దీంతో నా వ్యాఖ్యలతో గవర్నర్ ను గాయపరిస్తే..వాటిని ఉపసంహరించుకుంటానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలు ద్వేషంతో చేసినవి కావని కూడా ఆయన వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి