రోగం నయం చేస్తానని.. రూమ్‌లోకి తీసుకెళ్లి రేప్ చేయబోయిన్ బాబాజీకి?

మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (09:00 IST)
మహిళలను లైంగికంగా వేధించిన స్వామీజీ అసలు గుట్టురట్టు అయ్యింది. చెన్నై గూడువాంజేరిలో మహిళలను లైంగికంగా వేధించిన స్వామీజీకి ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. గూడువాంజేరి నందివరం-గూడు వాంజేరి రాణి అన్నానగర్‌ ప్రాంతంలో అన్నాదురై అలియాస్‌ అన్నామలై ఆది శివ బ్రహ్మ శివనాండియార్‌ పేరిట ఓ ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. 
 
చిన్న రోగాలకు అన్నామలై స్వామిజీ చిన్పపాటి చికిత్సలు అందించడమే కాకుండా జాతకాలు, జ్యోతిషం చెప్పే ఇతని వద్దకు ఓ వృద్ధురాలు తన మనుమరాలిని తీసుకొచ్చింది. మనుమరాలికి విభూది ఇస్తానని తద్వారా ఆమె అనారోగ్యాన్ని నయం చేస్తానని స్వామీజీ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో గదిలోకి తీసుకెళ్లిన స్వామిజీ ఆమెపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించడంతో యువతి కేకలు పెట్టింది. 
 
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వృద్ధురాలు బయల్దేరడంతో ఆమెను అడ్డుకున్న స్వామిజీ, విషయాన్ని బయటకుచెబితే మంత్రం వేసి కుటుంబసభ్యులను చంపుతానని బెదిరించాడు. అయితే యువతి కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు.. స్థానికులు స్వామీజీకి దేహశుద్ధి చేశారు.

వెబ్దునియా పై చదవండి