దీంతోపాటు తన వద్ద ఉన్న 20 తులాల బంగారాన్ని కూడా విక్రయించింది. అంతేకాకుండా, అందిన చోటల్లా అప్పులు చేసింది. ఈ అప్పులు పెరిగిపోవడంతో పాటు వాటిని తిరిగి చెల్లించేలని పరిస్థితి ఏర్పడటంతో దిక్కుతోచని స్థితిలో భవానీ ఆత్మహత్యే శరణ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై చెన్నై మణలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపగా, ఆన్‌లైన్ రమ్మీకి బానిసగా మారి ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది.