ఈ దృశ్యాన్ని ఓ మీడియా ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించడమేకాకుండా పత్రికలో ప్రచురించాడు. ఇప్పుడీ ఫోటో పత్రికల్లోనూ, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేపింది. వైద్య విద్యనభ్యసించిన సదరు ఐఏఎస్ అధికారిపై నెటిజెన్లు మండిపడుతున్నారు.
ఈ విషయంపై స్పందించిన ఐఏఎస్ అధికారి జగదీష్ సోంకర్... ''తను కావాలని చేయలేదని, తన చర్య ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని కోరారు. నేను ప్రవర్తించిన ఈ చర్యకు బాధ్యతగా క్షమాపణలు కోరుతున్నాను. ఈ చర్యను సమర్థించుకోవడానికి మాటలు సరిపోవు. అయితే కావాలని ఇలా చేయలేదు. ఇలాంటి ప్రవర్తన వల్ల సివిల్ సర్వీసు ప్రతిష్టకు భంగం కలుగుతుందని అర్థం చేసుకోగలను. అధికారులందరికీ క్షమాపణలు చెబుతున్నాను'' అంటూ ఫేస్‌బుక్‌లో తన కామెంట్స్ పోస్ట్ చేశాడు.