చైనా వెనక్కి తగ్గింది, భారత్ కమాండర్లతో చర్చలు సఫలం

మంగళవారం, 9 జూన్ 2020 (21:40 IST)
భారత సరిహద్దుల్లో చైనా సైనిక బలగాలను మోహరించడం వల్ల నెల రోజుల నుండి చోటుచేసుకుంటున్న ఉద్రిక్తలకు ఇప్పుడు తెరపడింది. ఇరు దేశాలకు చెందిన మిలటరీ కమాండర్ల మధ్య చర్చలు జరిగాక చైనా వెనక్కి తగ్గింది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ ప్రాంతం నుంచి సైనిక బలగాలను ఉపసంహరించింది.
 
పాంగ్యాంగ్‌త్సో సెక్టార్‌ నుంచి కూడా చైనా బలగాలు భారీగా వెనక్కు వెళుతున్నాయి. సోమవారం నుండే చైనా సైనిక బలగాల ఉపసంహరణను ప్రారంభించిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మూడు ప్రాంతాలలో మోహరింపును ఖాళీ చేయగా, నాలుగో ప్రాంతం నుండి బలగాలు నిష్క్రమిస్తున్నాయి.
 
కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనాలోని సౌత్ జిన్‌జియాంగ్ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ మధ్య చర్చలు జరగడంతో సమస్య పరిష్కార దిశగా సాగింది. గాల్వాన్ ప్రాంతం, పెట్రోలింగ్ ప్రాంతం 15, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యం మధ్య ఈ వారం చర్చలు జరిగాయి. బుధవారం మరోసారి మిలటరీ చర్చలు జరగనున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు