దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అనేక కీలక తీర్పులు వెలువరించిన ఏస్ఏ బాబ్డేకు... బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టం. అందుకే 64 యేళ్ళ బాబ్డే అత్యంత ఖరీదైన హార్లే డేవిడ్‌సన్ బైకును నడిపాడు. గత వారం వీకెండ్‌లో ఆయన నాగ్‌పూర్‌లో ఈ బైకుపై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లాక్డౌన్ సమయంలో న్యాయవాదులు నల్ల కోట్లు వేసుకోరాదని, తెల్లటి షర్ట్‌లు ధరించి, దానిపై బ్లాక్ నెక్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుందని అన్నారు. ఇటీవల తీర్పులన్నీ వీడియో కాన్ఫరెన్స్‌లోనే నిర్వహిస్తున్నారాయన.