ఆ వ్యాక్సిన్‌ వికటిస్తే నష్టపరిహారం!

శనివారం, 16 జనవరి 2021 (19:24 IST)
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌కు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌కు మాత్రమే పరిమిత వినియోగంపై అనుమతులు లభించాయి. కోవిషీల్డ్‌ తీసుకునేవారికి సాధారణంగానే వ్యాక్సిన్‌ వేస్తారు. కానీ, కోవాగ్జిన్‌ తీసుకోవాలంటే మాత్రం అంగీకారపత్రంపై సంతకం పెట్టాల్సి ఉంటుంది.

షరతులు, నిబంధనలు ఈ పత్రంలో ఉంటాయి. ఒకవేళ కోవాగ్జిన్‌ తీసుకున్న తర్వాత సదరు వ్యక్తిలో ఆరోగ్యపరంగా ఏమైనా ప్రతికూల పరిస్థితులు కనిపించినా.. అందుకు ఆ వ్యాక్సినే కారణమని తేలినా.. సదరు వ్యక్తికి వైద్యఖర్చును భరించడమే కాకుండా నష్టపరిహారాన్ని కూడా భారత్‌ బయోటెక్‌ చెల్లిస్తుంది.

ఈ పరిహారాన్ని ఐసిఎంఆర్‌కు చెందిన సెంట్రల్‌ ఎథిక్స్‌ కమిటీ నిర్ణయిస్తుంది. కోవాగ్జిన్‌ తీసుకున్నవారికి ఓ ఫ్యాక్ట్‌ షీట్‌ను, దుష్ఫలితాలను తెలియజేసే ఓ ఫారాన్ని ఇస్తారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న నాటి నుండి ఒక వారం పాటు ఆరోగ్యపరంగా ఎదురైన పరిస్థితులను ఈ ఫారంలో రాయాల్సి ఉంటుంది. జ్వరం, నొప్పి, అలర్జీ, మంట వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినపుడు ఈ ఫారంలో రాయాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు