చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఓ లాయర్ 2014వ సంవత్సరం ఆహారం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న ఆహారంలో జుట్టు వుండగా, దీనిపై హోటల్ మేనేజ్‌మెంట్ వద్ద ఫిర్యాదు చేశాడు. తర్వాత ఆయనకు ఆహారాన్ని మార్చి సప్లై చేశారు.
నేపథ్యంలో శుభ్రత పాటించని ఆ హోటల్‌లో తీసుకున్న ఆహారం కారణంగా వాంతులు, తలతిరగడం, కడుపు నొప్పి ఏర్పడి ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు కస్టమర్ కోర్టులో ఆ లాయర్ కేసు పెట్టాడు. శుభ్రత పాటించని ఆహారాన్ని అందించని కారణంగా రూ.60లక్షలు జరిమానా విధించాలని కోరాడు.