బీహార్‌లో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కరోనా మృతుల సంఖ్య ఆదివారానికి ఆరుకు చేరింది. వివరాల్లోకి వెళితే, బీహార్‌లోని ముంగర్‌కి చెందిన వ్యక్తి కరోనావైరస్ సోకిన అనంతరం చికిత్స కోసం పాట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు.
రెండు రోజుల క్రితమే అతడు కోల్‌కతా నుంచి తిరిగొచ్చాడని పాట్నాలోని ఎయిమ్స్ డైరెక్టర్ ప్రభాత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇకపోతే, శనివారమే ముంబైలో 63 ఏళ్ల వృద్ధుడు కరోనాతో బాధపడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.