అయోధ్య రామ మందిర పూజారితో పాటు 16 మంది పోలీసులకు క‌రోనా

గురువారం, 30 జులై 2020 (16:08 IST)
అయోధ్యలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గన్న రామ జన్మభూమి పూజారి ప్రదీప్ దాస్‌ తో పాటు 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది.

దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్. ఆయనతో పాటు మరో నలుగురు పూజారులు కూడా ఉంటారు.  ఈ నలుగురిలో ప్రదీప్ దాస్‌ ఒకరు.

ఈయనకే కరోనా సోకటంతో, ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా సోకిన 16 మంది పోలీసులూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారని సమాచారం.

భవ్య రామ మందిర భూమి పూజకు చకా చకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అయోధ్య అంతటా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు