పెరుగుతున్న కరోనా.. 45వేలకు పైగా కోవిడ్ కేసులు- 564 మంది మృతి

శనివారం, 21 నవంబరు 2020 (11:15 IST)
దేశంలో నాలుగు రోజుల పాటు కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. శుక్రవారం 45 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఇవాళ 46 వేలకు పైగా మంది కరోనా బారినపడ్డారు. అయితే కొత్తగా వచ్చిన కేసుల కంటే మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం కొంత ఊరట కలిగిస్తోంది.
 
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 90,50,598కి చేరాయి. ఇందులో 84,78,124 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,39,747 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇంకా 49,715 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఈ మహమ్మారి వల్ల మరో 564 మంది మృతిచెందారు. దీంతో కరోనా మరణాలు 1,32,726కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు