కేంద్ర ఆరోగ్య మంత్రి ఓఎస్డీకి కరోనా - హెల్త్ మినిస్ట్రీలో కలకలం

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (10:38 IST)
కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఓఎస్డీగా కార్యాలయంలో పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డుకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆరోగ్య శాఖలో ఓ కలకలం రేపింది. వెంటనే ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. విషయం తెలిసిన మంత్రి సిబ్బంది కూడా ఆందోళనకు గురవుతున్నారు. 
 
అప్రమత్తమైన వైద్యాధికారులు ఓఎస్డీ కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. అలాగే, ఆయనతోపాటు పనిచేసిన సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లమని ఆదేశించారు. 
 
వైరస్ బారినపడిన సెక్యూరిటీ గార్డు మంత్రి కార్యాలయంలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ టీచింగ్ బ్లాక్‌లో మంత్రికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడు ఎవరెవరిని కలిసి ఉంటాడనే దానిపై ఆరా తీస్తున్న అధికారులు వారిని గుర్తించేపనిలో పడ్డారు. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్‌లో నలుగురు సిబ్బందికి ఈ వైరస్ సోకింది. అలాగే, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి ఈ వైరస్ సోకింది. ఎంపీకి చెందిన ఇద్దరు సోదరులు, వారి భార్యలు, తండ్రి, ఓ కుమారుడికి ఈ వైరస్ సోకింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు