కమల్‌ హాసన్‌పై విచారణ వచ్చేనెల 9కి వాయిదా

శనివారం, 23 నవంబరు 2019 (13:24 IST)
సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యం (MNM) చీఫ్ కమల్‌ హాసన్‌పై నమోదైన ఓ క్రిమినల్ కేసులో విచారణను వచ్చేనెల 9కి వాయిదా వేస్తూ ఢిల్లీలోని ఓ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.


నాథూరాం గాడ్సే స్వతంత్ర భారత మొదటి ఉగ్రవాది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమిళనాడులో కమల్ హాసన్ ప్రచారం చేశారు. 
 
ఇందులో భాగంగా  గాంధీని చంపిన తొలి హిందూ ఉగ్రవాది నాథూరాం గాడ్సే అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హిందూ సేన చీఫ్ విష్ణు గుప్త తమ మనోభావాలు దెబ్బతీస్తూ, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కమల్ హాసన్‌పై కేసు పెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు