దేశంలో మళ్లీ పెరిగిన కేసులు... హెచ్చుత‌గ్గుల‌తో డైల‌మా!

బుధవారం, 13 అక్టోబరు 2021 (11:26 IST)
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కానీ, త‌ర‌చూ హెచ్చ త‌గ్గుల‌తో డైల‌మా ప‌రిస్థితి కొన‌సాగుతోంది. ముందు రోజు ఏడు నెలల కనిష్ఠానికి తగ్గిన కొత్త కేసులు(14,313) తాజాగా పెరిగి 15 వేలకు చేరాయి. మృతుల సంఖ్య కూడా 200పైనే  నమోదైంది. అయితే క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతూ రెండు లక్షలకు చేరువవుతుండటం ఊరటనిస్తోంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
 
మంగళవారం 13,26,399 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,823 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుకంటే 1,500కు పైగా కేసులు పెరిగాయి. నిన్న 22,844 మంది కోలుకున్నారు. మరో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3.40 కోట్ల మందికి కరోనా సోకింది. అందులో 3.33 కోట్ల(98.06 శాతం) మంది కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 2,07,653 (0.61 శాతం)గా ఉంది. 4,51,189 (1.33 శాతం)మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.
 
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. నిన్న 50.63 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య  96.43 కోట్ల మార్కును దాటింది. ఇది స‌రికొత్త రికార్డు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు